UPSC CAPF Recruitment 2022 Application last date: బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎఎస్‌బీ కేంద్ర సాయుధ బలగాల్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల (Assistant Commandant Posts) భర్తీకి నోటిఫికేషన్ విడుదల

UPSC CAPF Recruitment 2022 Application last date: బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎఎస్‌బీ కేంద్ర సాయుధ బలగాల్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల (Assistant Commandant Posts)కు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగుస్తుంది.భారత రక్షణ దళంలో ఉద్యోగాలకు ఎదురు చూసే అభ్యర్ధులకు ఇది సువర్ణావకాశం. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల నియామక ప్రక్రియ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆధ్వర్యంలో జరుగుతుంది. సీఏపీఎఫ్‌ – 2022 నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం క్లుప్తంగా మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 253

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ కమాండెంట్లు పోస్టులు

ఖాళీల వివరాలు:

బీఎస్ఎఫ్ పోస్టులు: 66
సీఆర్‌పీఎఫ్ పోస్టులు: 29
సీఐఎస్ఎఫ్ పోస్టులు: 62
ఐటీబీపీ పోస్టులు: 14
ఎస్ఎస్‌బీ పోస్టులు: 82
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2022లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్‌/ ఎఫిషియన్సీ టెస్టులు, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష విధానం: రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు, పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నాం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. పేపర్‌-1లో జనరల్ ఎబిలిటీ, ఇంటలిజెన్స్ విభాగాలు ఉంటాయి. దీన్ని 250 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ఉంటాయి. ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-2లో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ విభాగాలు ఉంటాయి. దీన్ని 200 మార్కులకు నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

జనరల్‌ అభ్యర్ధులకు: రూ.200
ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
పరీక్ష తేది: ఆగస్టు 7, 2022.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 10, 2022.

దరఖాస్తుల ఉపసంహరణ తేదీలు: 2022, మే 17 నుంచి మే 23 సాయంత్రం 6 గంటల వరకు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top