Bank of Maharashtra recruitment 2022: Apply for 500 General Officer posts till February 22

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. 500 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా జనరలిస్ట్‌ ఆఫీసర్‌ స్కేల్‌-2, జనరలిస్ట్‌ ఆఫీసర్లు స్కేల్‌-3 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్కేల్2 ఉద్యోగ ఖాళీలు 400 ఉండగా స్కేల్3 ఉద్యోగ ఖాళీలు మాత్రం 100 ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హతతో కనీసం 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు స్కేల్2 ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.

స్కేల్2 ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. స్కేల్ 3 ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు కూడా 60 శాతం మార్కులతో కచ్చితంగా డిగ్రీ పాసై ఉండాలి. కనీసం ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఆన్ లైన్ విధానంలో జనరలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. మహిళా అభ్యర్థులు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. https://www.bankofmaharashtra.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 22వ తేదీ చివరి తేదీగా ఉండనుంది. 2022 సంవత్సరం మార్చి నెల 12వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్షను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top