ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) పలు ఉద్యోగాలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించిందిఈ మేరకు బ్యాంకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
Central Bank of India || సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగ నియామకాలు:
- దరఖాస్తులు ప్రారంభం:23-11-2021
- దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేది :17-12-2021
దిగువ పేర్కొన్న ఫీల్డ్‌లలో స్పెషల్ ఆఫీసర్ కోసం ఖాళీలు అందుబాటులో ఉన్నాయి
-ఆర్థికవేత్త - 1
ఆదాయపు పన్ను అధికారి - 1
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 1
డేటా సైంటిస్ట్ IV - 1
క్రెడిట్ ఆఫీసర్ III - 10
డేటా ఇంజనీర్ III - 11
IT సెక్యూరిటీ అనలిస్ట్ III - 1
IT SOC విశ్లేషకుడు III - 2
రిస్క్ మేనేజర్ III - 5
టెక్నికల్ ఆఫీసర్ (క్రెడిట్) III - 5
ఆర్థిక విశ్లేషకుడు II - 20
సమాచార సాంకేతికత II - 15
లా ఆఫీసర్ II - 20
రిస్క్ మేనేజర్ II - 10
భద్రత II - 3
భద్రత I - 1
ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు జనవరి 22న ఆన్లైన్ ఎగ్జామ్ (Exam) నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జనవరి 11 నుంచి అందించనున్నారు.
విద్యార్హతల వివరాలు:
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఎంబీఏ, మాస్టర్ డిగ్రీ, సీఏ, సీఎఫ్ఏ, పీహెచ్డీ చేసిన అభ్యర్థులు ఆయా పోస్టులకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు ఫీజుగా రూ. 850ని నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఎలా అంటే..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నంబర్ 23న ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఆ తేదీ నుంచి www.centralbankofindia.co.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Job Notifications
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ మరియు వివిధ ప్రైవేటు కంపెనీలు విడుదల చేసే నోటిఫికేషన్లు కావలసినవారు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి

Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment