APSSDC Flipkart Recruitment Notification

 ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగా ప్రకటనలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సంస్థ నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో పని చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 8లోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 9న ఉదయం 10 గంటలకు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు.డెలివరీ ఎగ్జిక్యూటీవ్, సీనియర్ అసిస్టెంట్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు.

ఈ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులకు స్మార్ట్ ఫోన్, బైక్, టూ వీలర్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈ విభాగంలో ఎంపికైన వారికి నెలకు రూ. 13 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వేతనంతో పాటు పెట్రోల్ అలవెన్స్, మొబైల్ బిల్, ఇతర ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. ఈ విభాగంలో ఎంపికైన అభ్యర్థులు ఏపీలో పని చేయాల్సి ఉంటుంది.

ఈ విభాగంలో 150 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.

-ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి..అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 08లోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల మొబైల్ నంబర్లకు గూగుల్ మీట్ ఇంటర్వ్యూ లింక్ పంపిస్తారు. ఆ లింక్ ద్వారా అభ్యర్థులు ఈ నెల 9న జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర వివరాలకు 8978524022, 7780558838 నంబర్లను సంప్రదించవచ్చు.

ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/JsTuEfIY6B70GU7z1dq081



Posted in:

Related Posts

2 comments:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top