Government Jobs : బీటెక్‌ వాళ్లకు హైదరాబాద్‌ BDL లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. రూ.39,000 వరకూ జీతం

BDL Hyderabad Recruitment : ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL).. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 100 ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు విధిగా హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నం, కొచ్చి, ముంబయిలోని ఉన్న బీడీఎల్‌ కార్యాలయాలు/యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు మే 24 నుంచి జూన్ 23 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వివరాల్లోకెళ్తే..ప్రాజెక్ట్ ఇంజినీర్/ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు - 100
విభాగాలు: హెచ్‌ఆర్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 10.05.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.39,000.ముఖ్యమైన తేదీలు

దరఖాస్తులు ప్రారంభం: మే 24, 2023.

దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 23, 2023.

ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: జులై 05, 2023.

ఇంటర్వ్యూ తేదీలు: జులై రెండో వారంలో ఉంటాయి.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bdl-india.in/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top