ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్‌.. 10వ తరగతి పాసైన వాళ్లు అర్హులు

WDCW AP Anganwadi Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ పలు ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 10 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఉన్న అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ముఖ్య సమాచారం:
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అంగన్‌వాడీ వర్కర్/ మినీ అంగన్‌వాడీ వర్కర్/ అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్లకు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000 జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్‌ 24, 2022 చివరితేది.

వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర , ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసిన వారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి



పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top