IB Jobs: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 1671 ఉద్యోగాలు.. 10వ తరగతి పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు

IB Recruitment 2022: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 1671 సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 5 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి.

మొత్తం ఖాళీలు: 1671
సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్: 1,521 పోస్టులు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్‌): 150 పోస్టులు

ముఖ్య సమాచారం:
అర్హతలు: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలి.
వయోపరిమితి: 25.11.22 నాటికి ఎస్‌ఏ/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 25 ఏళ్లు, ఎంటీఎస్‌ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.21700-రూ.69100, ఎంటీఎస్‌ పోస్టులకు రూ.18000-రూ.56900.

పరీక్షా విధానం: టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షలు తదితరాలు ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.50)

దరఖాస్తులకు చివరితేది: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులు ప్రారంభం: నవంబర్‌ 05, 2022
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 25, 2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.mha.gov.in/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top