SBI Clerk Recruitment 2022: Registration for 5008 posts begins on September 7

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుంచి మరో ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా క్లరికల్ కేడర్ కింద ద్వారా 5,008 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 225 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 7 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు సెప్టెంబరు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. నవంబరులో ప్రిలిమినరీ పరీక్ష, డిసెంబరులో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
మొత్తం పోస్టులు:5008

వివరాలు....

విద్యార్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా 
తత్సమాన విద్యార్హత ఉండాలి. డిగ్రీ ఫైనల్/
చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 01.08.2022 నాటికి 20 ఏళ్ల నుంచి 28
ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1994 01.08.2002 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడీబ్ల్యూడీ (జనరల్/ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.1,99,00.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు:  ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా. స్థానిక భాష (లోకల్ లాంగ్వేజ్ టెస్ట్) పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.

పరీక్ష విధానం:

I. ప్రిలిమినరీ పరీక్ష:

మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష
నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులకు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట. పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.

II. మెయిన్ ఎగ్జామ్:

మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష 
ప్రశ్నలు ఉంటాయి.ఇందులో నాలుగు విభాగాలు
ఉంటుంది. మొత్తం 190 ఉంటాయి. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగరం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు...

• ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.09.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:27.09.2022.

దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 12.10.2022.

ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్, 2022లో.

• మెయిన్ పరీక్ష తేది: జనవరి 2023లో ఉంటుంది.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్ అప్ గ్రూపులో చేరండి:


టెలిగ్రామ్ గ్రూప్: https://t.me/apjobs9

Complete Notification

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top