TSLPRB Constable Hall Ticket2022: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ హాల్టికెట్లు రెడీ.. డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇదే

TSLPRB Constable Hall Ticket 2022:
తెలంగాణ కానిస్టేబుల్ తత్సమాన ఉద్యోగాలకు నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించి ఆగస్టు 18వ తేదీ నుంచి హాల్టికెట్లు జారీచేస్తున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆగస్టు 28వ తేదీన రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగే ఈ పరీక్షకు 6,61,196 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.  అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 కేంద్రాలు ఏర్పాటుచేశారు. అభ్యర్థులు 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ హాల్ టికెట్లు https://www.tslprb.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. డౌన్లోడ్ ప్రక్రియలో ఏదైనా ఇబ్బంది తలెత్తితో support@tslprb.in కు ఈమెయిల్ లేదా 9393711110, 9391005006 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే:

అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్ను ప్రింట్(కలర్లోనే తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు) తీసుకోవాలి. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా కాగితానికి మరోవైపు ప్రింట్ తీసుకోవాలి.

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్లోడ్ చేసిన ఫొటోను హాల్టికెట్పై అతికించాలి.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన వారు ఈ క్రింది వాట్స్ అప్ గ్రూప్లో చేరండి



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top