భర్తీ చేసే పోస్టులు:
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్.. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర(Mitra), టీమ్ లీడర్(Team Leader) పోస్టులను భర్తీ చేయనుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రక్రియ జూలై 21 నుంచి మొదలైంది. జూలై 28వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు
మొత్తం ఖాళీలు:22
టీం లీడర్:02
ఆరోగ్య మిత్ర:20
వీటిని పూర్తిగా ఔట్ సోర్సింగ్(Out Sourcing) ప్రాతిపదిక ఎంపిక చేయనున్నారు.
జీతభత్యాలు:
ఆరోగ్య మిత్రలకు నెలకు రూ.15 వేలు చొప్పున, టీమ్ లీడర్లకు రూ.18,500 చొప్పున జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల విద్యార్హతలో మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 42 ఏళ్లలోపు వయసున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ పరీక్ష సమయంలో అభ్యర్థులు ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తీసుకొని రావాల్సి ఉంటుందని సూచించారు. రెజ్యుమ్ తోపాటు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని సూచించారు.
విద్యార్హతలు:
ఆరోగ్య మిత్ర ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారికి.. బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీ.ఫార్మసీ, ఫార్మా-డీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిగ్రీల్లో ఏదో ఒకటి ఉండాలి. టీమ్ లీడర్లుగా పని చేయాలని అనుకునేవారికి సైతం పైన పేర్కొన్న విద్యార్హతలతోపాటు హాస్పిటల్ సర్వీసెస్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. దానితో పాటు ఏదైనా కంప్యూటర్ కోర్సు చేసి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్‌తోపాటు అటెస్ట్ చేయించిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను డాక్టర్ వైఎస్సార్ District Medical and Health Office, Kakinada District, AP అడ్రస్ కు పంపంచాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/ మరియు https://eastgodavari.ap.gov.in/వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు వాట్స్అప్ గ్రూప్ లో చేరండి
అప్లికేషన్ దరఖాస్తు మరియు పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండ
0 comments:
Post a Comment