ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఒక ఉద్యోగం మరియు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఒక ఉద్యోగం భర్తీ
ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (APIC)లో స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఒక్క ఉద్యోగం మరియు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఒక ఉద్యోగం భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరబడుతున్నవి. స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మరియు/లేదా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉద్యోగాల నియామకం కోసం ప్రమాణాలను నెరవేర్చే మరియు ఆసక్తి గల వ్యక్తు లు తమ వివరాలను సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్, 1వ అంతస్తు, MGM క్యాపిటల్, NRI Y జంక్షన్ దగ్గర, చిన్నకాకాని (V), మంగళగిరి- 522508, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ వారికి పోస్టు ద్వారా లేదా స్వయంగా లేదా sic-ap @gov.in ఇ-మెయిల్ ద్వారా 24 జూన్, 2022న సా. 5.30 గం.లకు లేదా ఆలోగా చేరేలా పంపవచ్చును. తదుపరి వివరాలను శ్రీ ఎన్. థామస్ మార్టిన్, సూపరింటెండెంట్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సెల్ ఫోన్ నం. +91 8639376125) నుండి పని రోజులలో కార్యాలయ వేళలలో (ఉ.10.00 గం.ల నుండి సా. 5.30 గం.లు) పొందవచ్చును. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉద్యో గం మరియు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉద్యోగం కోసం అర్హత ప్రమాణాలు మరియు ప్రొఫార్మా దరఖాస్తు వివరాలను వెబ్సైట్ www.sic.ap.gov.in. నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును. దరఖాస్తుదారులు సమాచార హక్కు నియామాలు, 2019తో చదువబడే సమాచార హక్కు (సవరణ) చట్టం, 2019చే సవరించబడిన విధంగా సమాచార హక్కు చట్టం, 2005లోని సెక్షన్ 15 మరియు 16ను చూడవలసిందిగా కోరబడుతున్నారు.
0 comments:
Post a Comment