IBPS Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. డిగ్రీ పాస్ అయితే చాలు....

IBPS Recruitment 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల్ని (Bank Clerk Jobs) భర్తీ చేస్తోంది.
 ▪️మొత్తం ఖాళీలు:7855

భర్తీ చేసే బ్యాంకులు:

బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింద్, ఇండియన్ బ్యాంకుల్లోని క్లర్క్ పోస్టులనుకి ఐబీపీఎస్ భర్తీ చేయనుంది.


ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:07.10.21

▪️ దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరి తేదీ: 27.10.21

  ముఖ్య గమనిక: ఈ నోటిఫికేషన్‌కు జూలై 12 నుంచి 14 మధ్య దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. 

విద్యార్హతలు- అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.

ఇతర అర్హతలు- కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేసే నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి.

వయస్సు- 2021 జూలై 1 నాటికి 20 నుంచి 28 ఏళ్లు. అభ్యర్థులు 1993 జూలై 2 నుంచి 2001 జూలై 1 మధ్య జన్మించినవారై ఉండాలి.

దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.175.

ఎగ్జామ్ సెంటర్లు- ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్,కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/J8gs6rNE8fC7p2nE0cYoYR

IBPS Recruitment 2021:Notification
IBPS Recruitment 2021: Online Application
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top