APPSC Recruitment 2021 : ఏపీపీఎస్సీలో నాన్ గెజిటెడ్‌ ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు విధానం

    ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Andhra Pradesh Public Service Commission) ఖాళీల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Notification) విడుదల చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌లు విభాగాల్లో నాన్ గెజిటెట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. పోస్టుల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ న‌వంబ‌ర్ 12, 2021 నుంచి ప్రారంభం అవుతుంది.                                                                           ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Andhra Pradesh Public Service Commission) ఖాళీల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Notification) విడుదల చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌లు విభాగాల్లో నాన్ గ‌జిటెట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా అసిస్టెంట ప‌బ్లిక్ రిలేష‌న‌ల్ ఆఫీస‌ర్లు (Public Relational Officers), అసిస్టెంట్ స్టాటిస్టిక్ ఆఫీస‌ర్‌, ఫుడ్‌సేఫ్టీ ఆఫీస‌ర్ వంటి త‌దిత‌ర 38 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ న‌వంబ‌ర్ 12, 2021 ప్రారంభ‌మై డిసెంబ‌ర్ 7, 2021 వ‌ర‌కు కొన‌సాగుతుంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకొనే వ్య‌క్తి వ‌య‌సు జూలై 1, 2021 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.  ఖాళీలు, అర్హ‌త‌ల వివ‌రాల కోసం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి. ద‌ర‌ఖాస్తు కోసం అధికారిక‌ వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.                                                                                                              పోస్టుల వివ‌రాలు అర్హ‌త‌లు..
పోస్టు పేరు అర్హ‌త‌లు ఖాళీలు
అసిస్టెంట ప‌బ్లిక్ రిలేష‌న‌ల్ ఆఫీస‌ర్లు బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. జ‌ర్న‌లిజం/ ప‌బ్లిక్ రిలేష‌న్‌లో డిగ్రీ లేదా డిప్ల‌మా (Diploma) చేసి ఉండాలి 06
అసిస్టెంట్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్‌లు సంబంధిత రంగాల్లో అంటే మ్యాథ‌మెటిక్స్‌, స్టాటిక్స్‌, ఎక‌న‌మిక్స్ కామ‌ర్స్‌,కంప్యూట‌ర్ సైన్స్‌ (Computer Science) ల‌లో బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. 29
ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్‌లు సంబంధిత రంగంలో డిగ్రీ లేదా త‌త్స‌మ కోర్సు పూర్తి చేసి ఉండాలి. 01
హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్‌లు గ్రాడ్యుయేష‌న్‌ (Graduation) తోపాటు బీఈడీ (BEd) చేసి ఉండాలి. 02                                                        ఎంపిక విధానం..
- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌కు కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష (Computer Based Exam)  నిర్వ‌హిస్తారు.
- ప‌రీక్షలో ఎంపిక‌కైన వారిని మెరిట్ (Merit) ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
IIT Hyderabad : బీటెక్‌లో కొత్త కోర్సులు.. అక్టోబ‌ర్ నుంచి ప్రారంభించ‌నున్న ఐఐటీ హైద‌రాబాద్‌

ఏపీపీఎస్సీ రిజిస్ట్రేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 : అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2 :హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.

Step 3 :  ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.

Step 4  అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 5 : యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.

Step 6 :  ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.

Step 7 :  ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.

Step 8 : యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

Step 9 : పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

Step 10 : అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.

Step 11 :  ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 7, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
Posted in:

Related Posts

3 comments:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top