హిందుస్తాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్-HURL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హిందుస్తాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్-HURL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోల్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హిందుస్తాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల జాయింట్ వెంచర్ ఇది. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 513 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://hurl.net.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 513
జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 1 (కెమికల్)- 39
జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 1 (మెకానికల్)- 21
జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 1 (ఎలక్ట్రికల్)- 15
జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 1 (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 15
జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 (అమ్మోనియా)- 30
ఇంజనీర్ అసిస్టెంట్ 1 (అమ్మోనియా)- 45
జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 (యూరియా)- 15
ఇంజనీర్ అసిస్టెంట్ 1 (యూరియా)- 30
జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 (ఆఫ్‌సైట్ అండ్ యుటిలిటీస్)- 15
ఇంజనీర్ అసిస్టెంట్ 1 (ఆఫ్‌సైట్ అండ్ యుటిలిటీస్)- 30
జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 (మెకానికల్)- 33
ఇంజనీర్ అసిస్టెంట్ 1 (మెకానికల్)- 36
జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 (ఎలక్ట్రికల్)- 21
ఇంజనీర్ అసిస్టెంట్ 1 (ఎలక్ట్రికల్)- 18
జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 24
ఇంజనీర్ అసిస్టెంట్ 1 (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 24
జూనియర్ స్టోర్ అసిస్టెంట్- 3
స్టోర్ అసిస్టెంట్ 1 - 6
స్టోర్ అసిస్టెంట్ 2 - 3
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ 2 (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 6
అకౌంట్స్ అసిస్టెంట్ 1 (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 6
జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 1 (యూరియా ప్రొడక్ట్ హ్యాండ్లింగ్)- 15
ఇంజనీర్ అసిస్టెంట్ 1 (యూరియా ప్రొడక్ట్ హ్యాండ్లింగ్)- 15
జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ 2 (ఎన్విరాన్‌మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్)- 18
ల్యాబ్ అసిస్టెంట్ 1 (ఎన్విరాన్‌మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్)- 18
జూనియర్ క్వాలిటీ అసిస్టెంట్ 2 (క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ ఇన్‌స్పెక్షన్) -6
క్వాలిటీ అసిస్టెంట్ 1 (క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ ఇన్‌స్పెక్షన్) -6
HURL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 3
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 16
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 ఆగస్ట్ 16
విద్యార్హతలు- డిప్లొమా, డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా పాస్ అయినవారు అర్హులు కాదు.
ఇతర నిబంధనలు- ఒక అభ్యర్థి ఒక దరఖాస్తు మాత్రమే చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్.
వేతనం- ఫ్రెషర్స్‌కి ఏడాదికి రూ.3,00,000, ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి రూ.4,10,000, పదేళ్ల అనుభవం ఉన్నవారికి రూ.4,90,000, పదిహేనేళ్ల అనుభవం ఉన్నవారికి రూ.5,80,000.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top